26 May, 2026 | 5:25 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

కోలిండియా స్థాయి పోటీలో రాణించాలి

24-10-2025 11:31 PM

మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి కార్మిక క్రీడాకారులు, కళాకారులు కోలిండియా స్థాయిలో జరిగే పోటీల్లో ప్రతిభ కనబరిచి, సింగరేణి సంస్థకు ఏరియాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఏరియా సీనియర్ పిఓ, క్రీడల గౌరవ కార్యదర్శి ఎం కార్తీక్, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, కేకే 5 గని పిట్ కార్యదర్శి గాండ్ల సంపత్ లు కోరారు. ఏరియా వర్క్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (డబ్ల్యూపిఎస్ అండ్ జిఏ) ఆధ్వర్యంలో 61వ వార్షిక క్రీడల్లో భాగంగా పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన అవుట్ డోర్ హాకీ పోటీలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై, పోటీలను ప్రారంభించి మాట్లాడారు.

సింగరేణి ఉద్యోగులకు ప్రతి ఏటా క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, కళాకారులు కోలిండియా స్థాయిలో ప్రతి సంవత్సరం ఎన్నో బహుమతులు సాధించి, సింగరేణికి పేరు ప్రఖ్యాతలు తీసుకు వస్తున్నారన్నారు. సీనియర్ క్రీడాకారులు సంస్థలో పని చేస్తున్న యువ ఉద్యోగు లను, క్రీడలకు ప్రోత్సహించా లని సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికే కాక శారీరక దృఢత్వానికి సైతం తోడ్పడతాయని తెలిపారు. ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ అభివృద్ధికి దోహదం చేసిన వారవుతారన్నారు. ఈ పోటీల్లో కేకే గ్రూప్ విజేతలుగా నిలువగా, కాసీపేట, శాంతిఖని గ్రూప్ రన్నర్స్ గా నిలిచారు.