24 April, 2026 | 6:46 PM

Breaking News

హిందూ సమ్మేళనానికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రమేష్ నాయక్ ఆహ్వానం   •   డీసీఎం, ద్విచక్ర వాహనం ఢీ... వ్యక్తి మృతి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలను బేషరతుగా వెంటనే పరిష్కరించాలి   •   ఇల్లందు పట్టణంలో జరుగు అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ మహా సభలను విజయవంతం చేయండి   •   విశారదన్ మహారాజ్ ముందస్తు అరెస్ట్   •   పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్   •   బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి   •   నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ   •   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

బుగ్గలో శ్రావణ సందడి

12-08-2024 05:40 PM

మంచిర్యాల: బెల్లంపల్లి మండలంలో కన్నాల గ్రామపంచాయతీ పరిదిలో గల బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం శ్రావణమాసం సందడి నెలకొంది. బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాల నుండి అశేష భక్త జనం తరలివచ్చి రాజరాజేశ్వరునికి శ్రావణమాసం మొక్కులను చెల్లించుకున్నారు. దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీరామ్ బట్ల వేణుగోపాల శాస్త్రి గర్భగుడిలో శివలింగానికి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలను నిర్వహించారు.

దేవస్థాన కమిటీ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, కమిటీ సభ్యులు భావన్ల పల్లి గోపి, జిల్లపల్లి వెంకటస్వామి, సేవకులు బాలకృష్ణ ల ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూశారు. అశేషంగా తరలివచ్చిన భక్తజనంతో బుగ్గ కిక్కిరిసింది. జిల్లపల్లి వెంకట స్వామి దంపతులు భక్తులకు అన్నదానం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాథురి స్వామి దంపతులు బుగ్గలో రాజరాజేశ్వరునికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.