ఆ ముగ్గురే !
నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ
మ్యాచ్‌కు వర్షం ముప్పు
ముంచినా తేల్చినా
ఐపీఎల్ ఆరంభం నుంచి ప్రత్యర్థి జట్లపై భారీ స్కోర్లతో విరుచుకుపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలకమైన ప్లేఆఫ్స్ చేరువయ్యే సమయానికి తడబడుతోంది. ఆఖరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు పరాజయాలు చవిచూడడం రైజర్స్‌ను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేసింది. భారీ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హైదరాబాద్ ఇప్పుడు 200 మార్కును అధిగమించడానికి కూడా కష్టపడుతోంది. తాజా సీజన్‌లో హైదరాబాద్ ఒకటికి రెండుసార్లు అత్యధిక పరుగుల రికార్డు బద్దలు కొట్టిందంటే అందుకు ముఖ్య కారణం హెడ్, అభిషేక్, క్లాసెన్. ఈ ముగ్గురు రాణిస్తేనే రైజర్స్ రైడింగ్ సాఫీగా సాగనుంది. మరి సొంతగడ్డపై లక్నోతో పోరులో ఈ త్రయం ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం.
విజయక్రాంతి ఖేల్ ప్రతినిధి: ఐపీఎల్ 17వ సీజన్‌లో నేడు మరో రసవత్తర పోరు జరగనుంది. ప్లేఆఫ్ రేసులో ముందు వరుసలో ఉన్న సన్‌రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లకు విజయం కీలకంగా మారింది. రైజర్స్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. లక్నో ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో ఐదో స్థానంలో ఉంది. విజయాలు సమానంగా ఉన్నప్పటికి నెట్ రన్‌రేట్ విషయంలో హైదరాబాద్ మెరుగ్గా ఉంది. లక్నోతో మ్యాచ్‌లో విజయం సాధిస్తే రన్‌రేట్ పెరగడంతో పాటు ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ కానుంది. మరోవైపు లక్నో కూడా మ్యాచ్ విజయంపై దృష్టి సారించింది.
టాపార్డర్ మీదే భారం..
హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ టాప్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్‌లు రాణించడంపైనే రైజర్స్ భారీ స్కోర్లు ఆధారపడి ఉన్నాయి. ఈ ముగ్గురు విఫలమైన రోజున మిగతా బ్యాటర్లలో పెద్దగా రాణించలేకపోతున్నారు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆకట్టకున్నప్పటికి అతనికి సరైన సహకారం లభించడం లేదు. ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ ఆడుతున్నప్పటికి భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నాడు. మార్కరమ్ స్థానంలో జట్టులోకి వచ్చిన మార్కో జాన్సెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇక హెడ్ వచ్చిన తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన మయాంక్ అగర్వాల్ ముంబైతో మ్యాచ్‌లో ఆడినప్పటికి బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. ఇక అబ్దుల్ సమద్ దూకుడుగా ఆడడంలో విఫలమవుతున్నాడు. కెప్టెన్ కమిన్స్ మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. సోమవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించినప్పటికి బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయింది. చేజింగ్‌లో సూర్యకుమార్ సెంచరీతో చెలరేగడం.. వికెట్లు తీయడంలో విఫలం కావడంతో రైజర్స్ ఓటమిని మూటగట్టుకుంది. భువనేశ్వర్, కమిన్స్‌లు బాధ్యతాయుతంగా బౌలింగ్ చేస్తున్నప్పటికి.. మార్కో జాన్సెన్ , నటరాజన్‌లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. లక్నోతో మ్యాచ్‌లో బౌలింగ్ విభాగం మెరవాల్సిన అవసరముంది.
లక్నో విషయానికి వస్తే.. సీజన్ ఆరంభంలో వరుస విజయాలు నమోదు చేసిన ఆ జట్టు తర్వాత మాత్రం పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్, స్టోయినిస్‌లు రాణిస్తుండడం సానుకూలాంశం. ఫినిషర్‌గా నికోలస్ పూరన్ తన పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. ఈ ముగ్గురు మినహా జట్టులో మిగతా బ్యాటర్ల నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రావడం లేదు. కోల్‌కతాతో ఆడిన గత మ్యాచ్‌లో లక్నో బ్యాటింగ్ పూర్తిగా తేలిపోయింది. 235 పరుగులను ఛేదించే క్రమంలో లక్నో తక్కువ పరుగులకే ఇన్నింగ్స్‌ను ముగించింది. మోసిన్ ఖాన్, నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయి, యష్ ఠాకూర్‌లతో బౌలింగ్ విభాగం కాస్త పర్వాలేదనిపిస్తోంది. సొంగడ్డపై మ్యాచ్ జరుగుతుండడంతో లక్నోతో పోలిస్తే హైదరాబాద్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మంగళవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసింది. బుధవారం కూడా వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ సూచించింది. దీంతో పూర్తి మ్యాచ్‌ను ఆస్వాధించాలనుకున్న క్రికెట్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు.






