16 April, 2026 | 3:10 AM

సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం

16-04-2026 01:27 AM

హైదరాబాద్, ఏప్రిల్ 15(విజయక్రాంతి): సీబీఎస్‌ఈ పదవ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు 499 టాప్ మార్కును సాధించడం ద్యారా శ్రీ చైతన్య అల్ ఇండియా నం.1 గా మరోసారి రికార్డు సృష్టించింది.

9 మంది విద్యార్థులు 498 మార్కులు ఆపైన, 19 మంది విద్యార్థులు 497 మార్కులు ఆపైన, 41 మంది విద్యార్థులు 496 మార్కులు ఆపైన, 59 మంది విద్యార్థులు 495 మార్కులు ఆపైన 490 మార్కులు ఆపైన 268 మంది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సాధించారు.

‘ ఓవరాల్‌గా శ్రీ చైతన్య స్కూల్‌లోని అన్ని బ్రాంచీలు 100% ఉత్తీర్ణత సాధించాయి.శ్రీ చైతన్య స్కూల్ కలిగిన మెజారిటీ రాష్ట్రాల్లో స్టేట్ టాప్ మార్కులతోపాటు అత్యధిక యావరేజ్, పాస్ పర్సంటేజ్ తో ఆలిండియాలోనే కాదు ఆయా రాష్ట్రాల్లో కూడా మేమే నం.1 గా ఉన్నామని శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ తెలిపారు.

2025 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ నిర్వహించిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో  శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరిక్యులమ్ టాప్ మార్కులలో గాని, సబ్జెక్టుల వారీగా నూటికి నూరు మార్కులలో అత్యధిక సంఖ్యలో ఫలితాలు సాధంచి సంచలనాత్మక రికార్డ్ సృష్టించిందని శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ తెలిపారు.ఐఐటీ జేఈఈ, నీట్, ఒలింపియాడ్ వంటి జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్ష ఫలితాల్లో టాప్ ర్యాంకులతో నెం.౧గా నిలుస్తూ అటు స్టేట్ ఎస్‌ఎస్‌సీలోనూ, ఇటు సీబీఎస్‌ఈ లోనూ ఇంతటి సంచలనాత్మక ఫలితాలతో శ్రీ చైతన్య స్కూల్-టెక్నో కరిక్యులమ్ పాఠశాల విద్యకి అసలైన్ నిర్వచనంగా నిలిచిందని ఆమె  తెలిపారు.