ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని
తెలుగు రాష్ట్రాల బాధ్యతలు
హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): ఐఆర్‌ఎస్ అధికారి సురేష్ బత్తిని బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన 1991 బ్యాచ్‌కు చెందిన అధికారి. కార్పొరేట్ అసిస్మెంట్లు, ఆర్థిక పరిశోధనలు, అంతర్జాతీయ పన్నుల విభాగాల్లో అపారమైన అనుభవం ఉంది. హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కీలక విభాగాల్లో ఆయన గతంలో పనిచేశారు.
సురేష్ బత్తిని సెప్టెంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2026 వరకు హైదరాబాద్ ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయపు పన్ను పరిపాలన విభాగానికి నేతృత్వం వహించారు. ప్రస్తుతం కొత్త బాధ్యతలు చేపట్టడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ఆదాయపు పన్ను పరిపాలనను ఆయన పర్యవేక్షించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నియామకానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.






