13 April, 2026 | 4:49 AM

ఇంటర్ ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం

13-04-2026 03:21 AM

హైదరాబాద్, ఏప్రిల్ 12(విజయక్రాంతి): జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మా ర్కులకు శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 469తో ఇద్దరు,468 మార్కులు ఆపైన 147 మంది, 467 ఆపైన 701 మంది, 466 ఆపైన 1,378 మంది, 465 ఆపైన 1,988 మంది, 460 ఆపైన 4,497 మంది శ్రీచైతన్య విద్యార్థులే. జూనియర్ ఇంటర్ బైపీసీలో 440 మార్కులకు గాను శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 438తో 83 మంది, 437 ఆపైన 319 మంది,436 ఆపైన 583 మంది, 435 ఆపైన 837 మంది, 400 మార్కులు ఆపైన 4,941 మంది శ్రీచైతన్య విద్యార్థులే.

సీనియర్ ఇంటర్‌లో 1000 మార్కులకు 997 స్టేట్ టాప్ మార్క్‌తో పాటు 996 మార్కులు ఆపైన ముగ్గురు, 995 మార్కులు ఆపైన 16 మంది. 990 మార్కులు ఆపైన759 మంది శ్రీచైతన్య విద్యార్థులు సాధించారు. ఇప్పటికే విడుదలైన జేఈఈ మెయిన్ 2026లో సెషన్ 1, 2, ఎన్‌టీఏ ప్రొవిజనల్ కీ ప్రకారం 300కి 300 మార్కులు సాధించిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శ్రీచైతన్య విద్యార్థులే కావడం విశేషం.

ప్రతీ ఏటా ఐఐటీ నీట్‌లలో అత్యధిక ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులే సాధిస్తున్నారని, రేపటి ఐఐటీ అడ్వాన్స్‌డ్, నీట్‌లలోనూ నంబర్ వన్ ర్యాం కులు సాధిస్తారని శ్రీచైతన్య అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన ఆశాభావం వ్యక్తం చేశా రు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీచైతన్య సృష్టించినపటిష్టప్రోగ్రాములు, సరైన ప్రణాళిక, అగ్రశేణి అధ్యాపకులతో శిక్షణ వంటి ప్రత్యేకతలవల్లే ఇంటర్మీడియే ట్లో సబ్జెక్ట్స్‌పై మా విద్యార్థులు కాన్సెప్ట్యువల్‌గా పట్టు సాధించడంతో జాతీయస్థాయి పోటీపరీక్షల్లో టాపర్స్‌గా నిలుస్తున్నారని అ న్నారు. మా విద్యా సంస్థపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులను, ఇంతటి ఫలితాలకు దోహదపడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని శ్రీచైతన్య విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ  బొప్పన అభినందించారు.