16 April, 2026 | 4:01 PM

విజయవంతంగా ముగిసిన శ్రీచైతన్య స్కాలర్‌షిప్ టెస్ట్

03-11-2025 03:13 AM

కరీంనగర్, నవంబరు 2 (విజయ క్రాంతి): కరీంనగర్లో ప్రసిద్ధిగాంచిన శ్రీ చైతన్య ఇంటర్మిడియేట్ విద్యాసంస్థల ఐఐటి, నీట్ ఆకాడమీ ఆధ్యర్యంలో పదవ తరగతి విద్యార్ధులలో ప్రతిభను వెలకితీసి ప్రోత్సహించాలనే అక్ష్యంతోఆదివారం నిర్వహించిన స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్-2025 విజయవంతంగా ముగిసింది. శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత రమేష్ రెడ్డి మాట్లాడుతూ 12519 విద్యార్థులు నమోదు చేసుకోని పరీక్ష రాశారని తెలిపారు.  ఈ పరీక్షలో ప్రతిభ, మార్కుల ఆధారంగా 100% ఉచిత విద్యను ఇవ్వనున్నట్లు తెలిపారు.

మొదటి బహుమతి లాప్టాప్, 2 నుండి 10 వరకు బహుమతులకు టాబ్స్, రివార్డులు అందజేస్తామని తెలిపారు. ఈ పరీక్ష ఫలితాలను విద్యార్థులకు 3 నుండి 4 రోజులలో ప్రకటించి తెలియజేస్తామన్నారు. ఈ పరీక్షలో హజరైన విద్యార్థులందరకీ కూపన్లను అందజేసి, లక్కీ డ్రా లో వెలుబడిన మొదటి మూడు కూపన్లకు ప్రోత్సాహక బహుమతులను స్కార్టేవి, సైకిల్, సెల్ఫోను లను అందించారు. మొదటి బహుమతి జి. వర్షిణి, రెండవ బహుమతి పి శ్రీనిధి, మూడవ బహుమతి మహియా మహ్మద్ గెలుచుకోగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి,డీన్‌జగన్‌మోహన్‌రెడ్డి, ప్రిన్సిపల్స్, ఎజియమ్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.