calender_icon.png 5 November, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌లో ఎగిరేది గులాబీ జెండానే

03-11-2025 03:14:31 AM

ఇంటింటి ప్రచారంలో మాగంటి సునీత

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ పార్టీ దూకుడు పెంచింది. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతగోపినాథ్, గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచా రంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఆదివారం వెంగళరావు నగర్ డివిజన్‌లో ఆమె సుడిగాలి పర్యటన చేపట్టారు. గడపగడపకు తిరుగుతూ, ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. సునీత ప్రచా రానికి మద్దతుగా పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు తరలివచ్చారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లా డుతూ.. జూబ్లీహిల్స్‌లో ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు.