కొడంగల్ పర్యటనకు బయలుదేరిన సీఎం రేవంత్
08-05-2026 11:55 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కొడంగల్ పర్యటనకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో సీఎం బయలుదేరారు. సీఎం తో పాటు పలువురు మంత్రులు కొడంగల్ కు వెళ్తున్నారు. కొడంగల్ లో 430 పడకల ఆసుపత్రి నిర్మాణానికి, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దౌల్తాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గిలో వేణుగోపాలశ్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.






