15-01-2026 12:17:09 AM
లక్షకు పైగా భక్తుల రాక l 500కు పైగా పోలీసుల బందోబస్తు
భీమదేవరపల్లి, జనవరి 14 (విజయక్రాంతి): కొత్తకొండ వీరభద్రుడి సన్నిధి భక్తజన సముద్రమైంది. బుధవారం భోగి పర్వదినం పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, భద్రకాళి అమ్మవారికి శ్రీ చక్ర అర్చన వేడుకలు జరిగాయి. మధ్యాహ్నం శాలివాహనులు వీర బోనం సమర్పించి ఆలయ ప్రవేశం చేసిన తర్వాత వీరభద్రుడికి భద్రకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. నూతనంగా నియామకమైన ఆలయ చైర్మన్ అశోక్ ముఖర్జీని కురుమ సంఘం మండల శాఖ అధ్యక్షుడు గౌడ బాలాజీ ఆధ్వర్యంలో సత్కరించారు. వరంగల్, కరీంనగర్, హుజరాబాద్, గోదావరిఖని, హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున కొత్తకొండ జాతరకు తరలివచ్చారు.
సుమారు లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో కిషన్ రావు, చైర్మన్ వెల్లడించారు. చైర్మన్‌ను సన్మానించిన వారిలో మాజీ సర్పంచులు కంకల సమ్మయ్య, గుంటి ఓదెలు, చెవ్వల బుచ్చయ్య, బాగోతం డ్రైవర్ కొమురయ్య, కొంగొండ సమ్మయ్య, సమ్ము రమేష్, అన్న అజయ్, చివ్వల మల్లయ్య, ఈరాల కుమార్ స్వామి, బాగోతం రాజు, బొజ్జపురి రాజేంద్రప్రసాద్, బొజ్జపురి మురళీకృష్ణ , శివరాజ్ ఉన్నారు. భక్తులకు విశేష సేవలు అందించిన డైరెక్టర్లలో దేవరాజు శంకర్, పొన్నాల మురళి, డబ్బా శంకర్, కొత్తకొండ వెంకటేశ్వర్లు, బొల్లంపల్లి ప్రకాష్, మార్పు సంజీవరెడ్డి, వల్లే మహేందర్, తాళ్లపల్లి రమేష్, గోనెల సంపత్, డప్పు అజయ్, గోపగాని రాణి, కుర్ర రాజు, గుగులోత్ రమేష్, మండల మహేందర్ ఉన్నారు. ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, సీఐ పులి రమేష్, ముల్కనూర్ ఎస్సై రాజు ఆధ్వర్యంలో 500 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.