calender_icon.png 15 January, 2026 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి

15-01-2026 12:17:54 AM

కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, జనవరి 14(విజయక్రాంతి): పోలింగ్ కేంద్రాల్లాలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల కు సంబంధించి పదో వార్డు పోలింగ్ కేంద్రాలను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చే యాలని,

పోలింగ్ స్టేషన్ డిస్టెన్స్, తాగునీటి సౌకర్యం, ర్యాంపులు ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడింది మొదలుకొని.. ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.