15-01-2026 12:16:22 AM
హిజ్రాల సంఘం అధ్యక్షురాలు సునీత
సిద్దిపేట, జనవరి 14 (విజయక్రాంతి): వాతావరణంలో జరుగుతున్న మార్పులు, సాంప్రదాయంగా ఏర్పడిన పీడ దినాలలో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు అష్ట ఐశ్వర్యాలు కలగాలని అమ్మవారిని కోరుకున్నామని హిజ్రాల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు సునీత తెలిపారు. బుధవారం సిద్దిపేట రేణుక ఎల్లమ్మకు ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న హిజ్రాలు అంగ రంగ వైభవంగా బోనాలతో ర్యాలీ నిర్వహిం చి ఎల్లమ్మకు సమర్పించారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ప్రజలు సుభి క్షంగా ఉంటేనే సమాజం సంతోషంగా ఉం టుందని ప్రజలను ఆశీర్వదించే అమ్మవారిని పీడ దినాలలో ప్రత్యేకంగా వేడుకునేందుకే తాము బోనాల పండగ నిర్వహించామని చెప్పారు. ఈ ప్రాంతం ప్రజలకు అమ్మవారి కృపతో పాటు హిజ్రాల ఆశీర్వాదం ఉం టుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రజిని, ప్రశాంతి, కరిష్మా, అంకిత, చిన్నారి, నవీన్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.