calender_icon.png 12 February, 2026 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రారంభమైన శ్రీ కేతకి ఉత్సవాలు

12-02-2026 12:13:09 AM

ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి : ఈవో 

జహీరాబాద్, ఫిబ్రవరి 11 : శ్రీ కీతకి సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నాడు ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ ఉ త్సవాలను ప్రారంభించారు. పుట్ట పూజ, ధ్వ జారోహణ, శిఖర పూజ, అమ్మవారికి కుంకుమార్చన, సంగమేశ్వర స్వామికి అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కార్యనిర్వహణ అధికారి కార్యాలయం లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌక ర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని ధర్మకర్తల మండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ తెలిపారు. లడ్డు ప్రసాదం భక్తుల విజ్ఞప్తి మే రకు మంచి క్వాలిటీ లడ్డును ఈసారి అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్యూ లైన్ లో వచ్చే భక్తులు అతి శ్రద్ధతో భగవంతునిపై భక్తితో మహాశివరాత్రి రోజు దర్శించుకునేందుకు వస్తున్నందున వారికి తోడ్పాటు అం దించి దైవదర్శనం చేయించనున్నట్లు ఆయ న తెలిపారు.

ఆలయ ప్రాంగణంలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి సాధ్యమైనంత వరకు భక్తులకు క్యూలైన్ ద్వారానే దర్శనం చేయించనున్నట్లు తెలిపారు. విఐపి, వీవీఐపి దర్శనం తగ్గించినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నందున బస్సులు వచ్చే మార్గంలో ద్విచక్ర వాహనాలు ఇతర వాహనాలు నిలపడం వల్ల ఇ బ్బందులు కలుగుతున్నాయని, ఈసారి బస్సులు వచ్చే మార్గంలో భక్తులు కాలినడకన వెళ్లే మార్గంలో ఎలాంటి ద్విచక్ర వాహ నాలను అనుమతించబోమని తెలిపారు. 

ఈ సమావేశంలో ఆలయ కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్ప, ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు పాటిల్, ధర్మకర్తల మండలి మెంబర్ మల్లికార్జున్ పాల్గొన్నారు.