12-02-2026 12:14:52 AM
నంగునూరు, ఫిబ్రవరి 11:కాకతీయుల కాలం నాటి విశిష్ట నిర్మాణ శైలిని కలిగిన నంగునూరు మండలం ఖాతా శ్రీ మహేదవ్ స్వామి వారి 48వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభం కా నున్నాయి.సుమారు 200 మీటర్ల ఎత్తు లో ఉన్న ఈ గుట్టపై పరమశివుడు స్వయంగా వెలిశాడని భక్తుల నమ్మకం.నేడు సిద్దిపేట,వరంగల్ ,కరీంనగర్ జిల్లాలో సరిహ ద్దుల్లో ఉన్న భక్తులకు ఈ ఆలయం కొంగు బంగారంగా నిలుస్తుంది .
కళ్యాణ వార్షిక ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 15 న మహాశివరాత్రి పర్వదినాన సందర్భంగా స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఒగ్గు కథలు,భజనలతో ఐదు రోజులలు గుట్ట పరిసరాలు శివనామస్మరణతో మారుమోగాను న్నాయి.
చరిత్రాత్మక సాక్ష్యాలు.. అద్భుతాలకు నిలయం
ఈ ఆలయం వద్ద కనిపించే అతి పెద్ద విం త చెలిమే.గుట్టపై అంత ఎత్తులో ఉన్నప్పటికీ, త్రిభుజాకారంలో ఉండే ఈ చెలిమే నుంచి నిరంతరం నీరు ఊరుతుంది.చెలిమేలోని నీ టిని ఎంత తోడవేసినా, కేవలం ఐదు నిమిషాల్లోనే మళ్లీ నిండుతుంది. ఈ నీరు సర్వరో గ నివారణని ప్రజల నమ్మకం.విశాలమైన ఈ గుట్టపై స్వామివారు నడిచినట్లుగా భావి ంచే పాదముద్రలు ఇప్పటికి స్పష్టంగా కనిపిస్తాయని భక్తులు చెబుతుంటారు.
గత 48 ఏళ్లుగా గ్రామస్తులు ఐక్యమత్యంతో, ఆలయ కమిటీ ఉత్సవాలు నిర్వహిస్తూ ఆలయాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి), భక్తుల విరాళాలతో ఇక్కడ గీత భవనం , మెట్లు ఇతర వసతులు ఏర్పాటయ్యాయి.
అన్ని ఏర్పాట్లు పూర్తి
ఖత మహదేవ్ స్వామి వారి ఆశీస్సులతో గత 48 ఏళ్లుగా గ్రామస్తులందరం ఐకమత్యంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్ర కృతి ఒడిలో వెలిసిన ఈ మహాదేవుడిని దర్శించుకుని, ఆ పరమశివుని కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను.
చల్ల శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్