సర్వజ్ఞ స్కూల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): సర్వజ్ఞ పాఠశాల ప్రాంగణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి(Sri Krishna Janmashtami) వేడుకలు ఎంతో భక్తిశ్రద్ధలతో, కన్నులపండువగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధల వేషధారణలో అలరించి, సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాల ఛైర్మన్ శ్రీ ఆర్.వి. నాగేంద్ర, డైరెక్టర్ కె. నీలిమ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
ఆర్.వి. నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ‘భగవద్గీతలో శ్రీకృష్ణుడు అందించిన సందేశం, జీవితంలో ధర్మాన్ని పాటించడం, కర్తవ్యాన్ని నిర్వహించడం నేటి విద్యార్థులకు ఎంతో మార్గదర్శకం అన్నారు. డైరెక్టర్ కె. నీలిమ మాట్లాడుతూ.. ‘చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో వేదికపై ప్రదర్శించిన నృత్యాలు, భజనలు, నాటికలు అలరించాయి అని చెప్పారు.






