శ్రీ సాయి నగర్ కాలనీ కమిటీ ఏకగ్రీవం
మేడిపల్లి, జూన్ 30 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి శ్రీ సాయి నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులను పీర్జాదిగూడ మాజీ కార్పొరేటర్ దొంతరి హరి శంకర్ రెడ్డి సన్మానించారు.
ఈ నూతన అసోసియేషన్‌కు అధ్యక్షులుగా తౌడోజు ప్రభాకర్ చారి, ప్రధాన కార్యదర్శిగా నాగిరెడ్డి , కోశాధికారిగా నిరంజన్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇబ్రహీం, ఉపాధ్యక్షులు సరస్వతి, భాస్కర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చిరంజీవి, భానుప్రకాష్, ప్రదీప్ మహిళ అధ్యక్షురాలు లక్ష్మి, సలహాదారులు కళావతి, రాజేశ్వరి లలితా, భారతి గౌరవ అధ్యక్షులుగా సుదర్శన్ రెడ్డి,సునీల్, హరిందర్ యాదవ్, యాదగిరిల ను కాలనీ వాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలొ కాలనీ వాసులు పాల్గొన్నారు.






