ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రత పునరుద్ధరించాలి
తెలంగాణ స్వేరోస్
బాలాపూర్, జూన్ 30 (విజయక్రాంతి): స్వేరోస్ ఫౌండర్, చైర్మన్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను తక్షణమే పునరుద్ధరించాలని తెలంగాణ స్వేరోస్ డిమాండ్ చేసింది. మంగళవారం బాలాపూర్ స్వేరో సర్కిల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో స్వేరోస్ ప్రతినిధి మైలారం జగన్ మాట్లాడుతూ.. ప్రవీణ్ కుమార్ గారికి జీవితకాల భద్రత అవసరమని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నా, ప్రభుత్వం గన్మెన్లను తగ్గించి, బుల్లెట్ప్రూఫ్ వాహనాన్ని తొలగించడం ఆందోళనకరమన్నారు.
ప్రభుత్వ విధా నాలపై ప్రశ్నించే గొంతుకలను నొక్కేసేందుకే ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన భద్రతకు ఏమైనా విఘాతం కలిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, ఆయనకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని మైలారం ఆయన డిమాండ్ చేశారు.






