15 June, 2026 | 11:45 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

అయ్యప్ప ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

26-12-2025 04:16 PM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్,(విజయక్రాంతి): అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతియుతంగా జీవించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆకాంక్షించారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి 34వ మండలపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  మండలపూజ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు యువతలో క్రమశిక్షణ, సేవాభావాన్నిపెంపొందిస్తాయని, సమాజంలో ఐక్యతను బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా గాయని వేముల పుష్ప, నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగొని రజిత శ్రీనివాస్, కౌన్సిలర్ గాజుల సుకన్య, పార్టీ సీనియర్ నాయకులు పన్నాల రాఘవరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.