26-12-2025 04:21:45 PM
లేనియెడల భాజపా ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా నిర్మించే మార్చురీ గదిభవనాన్ని గతంలో ఉన్న స్థలంలోనే భవనాన్ని నిర్మించాలని ఇతర చోటా నిర్మించినట్లయితే భాజపా ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉన్న మార్చురీ భవనం, ఎస్సీ ఎస్టీ వసతి గృహాలకు దగ్గరగా ఉండడంతో గతంలో ఎంతోమంది విద్యార్థులు భయాందోళనకు గురవడమే కాకుండా, అనారోగ్య బారిన పడ్డారు.
గతంలో ఉన్న స్థలంలోనే మార్చురి గదిభవనాన్ని నిర్మించి కాంపౌండ్ వాల్ ఎత్తున నిర్మించాలని లేనిపక్షంలో భాజపా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల సంరక్షణ కోసం పోరాటం చేస్తామన్నారు. కొంతమంది అధికార పార్టీ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిబంధనల ప్రకారం నిర్మిస్తున్న మార్చురీ భవన నిర్మాణాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న మార్చురీ కాదని ఆపడం ఎంతవరకు సమంజసం అని బిజెపి నాయకులు అన్నారు. వేరేచోటకు తరలిస్తామంటే తాము ఊరుకునేదని, విద్యార్థులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి గుత్తేదారుకు భాజపా నాయకులు కలిసి సమస్యను విన్నవించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ మాజీ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఉమేష్. జిల్లా కౌన్సిల్ సభ్యులు తుప్తి ప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు గజ్జల మహేష్ నాయకులు శ్రీకాంత్ సాయి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.