మున్సిపల్ చైర్ పర్సన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీదేవీ రమేష్ నాయక్
మేడ్చల్ అర్బన్ ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ గా శ్రీదేవి రమేష్ నాయక్ పదవి బాధ్యతలు స్వీకరించారు.సోమవారం మున్సిపల్ కమిషనర్ స్వామి నాయక్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా కమిషనర్ స్వామి నాయక్ చైర్ పర్సన్ శ్రీదేవి రమేష్ కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్ లు శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి రమేష్ నాయక్ మాట్లాడుతూ మున్సిపల్ పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఆమే తెలిపారు. మున్సిపల్ పట్టణంలో పారిశుధ్యం, తాగునీరు, రహదారుల వంటి ప్రాథమిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆమే పేర్కొన్నారు. మున్సిపల్ పట్టణ ప్రజల సహకారంతో ఎల్లంపేట్ మున్సిపాలిటీని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి రమేష్ నాయక్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జీ చామకూర మహేందర్ రెడ్డి, మాజీ గ్రంధాలయ ఛైర్మన్ బి భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల మాజీ వైస్ ఎంపిపి వెంకటేష్, బీఆర్‌ఎస్ పార్టీ అద్యక్షులు సిహెచ్ దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, వి రాజ మల్లారెడ్డి,అప్పమ్మగారి జగన్ రెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యులు అకీటి నవీన్ రెడ్డి, మెట్టు శ్రీకాంత్ రెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్ లు సద్ది సురేష్ రెడ్డి, భూక్య శారద నాయక్, గుమ్మడిదల మహేశ్వరి, బందెల కుమార్,మాలోత్ రజిత, నీరుగంటి శ్రీలత రమేష్ యాదవ్, గోశిక అఖిల, దుడ్డు కల్పన మాణిక్యం,దాది నరసింహ.ఓం ప్రకాష్ గౌడ్, కత్తి వరలక్ష్మి సురేందర్,చిన్నోళ్ల భాస్కర్,సద్ది నిషితా రెడ్డి,వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




