30 May, 2026 | 2:11 PM

Breaking News

మంత్రి శ్రీధర్ బాబు కార్యదీక్షతతో దూసుకుపోతున్న ఐటీ రంగం   •   మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత   •   BRS మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ “అరెస్ట్”   •   దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఉంది: కిషన్ రెడ్డి   •   భూగర్భ జలాలు తగ్గడంతో సడక్ గూడకు ట్యాంకర్ నీరు   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్ధం   •   తీవ్ర విషాదం: బోల్తా పడిన ట్రాక్టర్— ఆరుగురు మృతి   •   ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 126 మందికి తప్పిన ప్రమాదం   •   వడ్రంగి వృత్తికి అటంకం కలిగిస్తున్న అటవీశాఖ అధికారులు   •   రోడ్డు పక్కనే నీటిగుంత.. ప్రజలకు తప్పని తిప్పలు   •  

ఏయూ పరిశోధక విద్యార్థిని అశ్వినికి పీహెచ్‌డీ పట్టా

24-02-2026 12:44 AM

ఘట్ కేసర్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ ఫార్మసీ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థిని జె. అశ్విని ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో పీహెచ్డీ పట్టా పొందినట్లు యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది. ఆమె తన పరిశోధనా వ్యాసం ఫార్ములేషన్ డెవలప్మెంట్, ఆప్టిమైజేషన్, ప్రోనియోప్రో సోమ్స్ ఆఫ్ యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్ ను స్కూల్ ఆఫ్ ఫార్మసీ డీన్ డాక్టర్ వసుధా బక్షి  పర్యవేక్షణలో పూర్తి చేశారు.

ఈనెల 13న జరిగిన ఫైనల్ వైవా (వివరణాత్మక పరీక్ష) కార్యక్రమంలో కోయంబత్తూరులోని పి.ఎస్.జి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. సుబ్రమణియన్, డీన్ డాక్టర్ సతీష్ కుమారన్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సికందర్ బాబా, రిజిస్ట్రార్ డాక్టర్ ఎ. పద్మనాభరావు ఇతర ప్రొఫెసర్లు పాల్గొన్నారు. హైపర్ టెన్షన్ (రక్తపోటు) నియంత్రణలో సాధారణ టాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రోనియోసోమ్స్ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు ఈ సందర్భంగా ఆమె పరిశోధనను అభినందించారు.