30 May, 2026 | 2:54 PM

TG EdCET 2026 ఫలితాలు విడుదల

30-05-2026 02:22 PM

హైదరాబాద్: TGEdCET 2026 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ పరీక్ష మే 12న రాష్ట్రవ్యాప్తంగా(TG EdCET) నిర్వహించబడింది. అధికారులు శనివారం తుది ఫలితాలను ప్రకటించడానికి ముందు, ప్రాథమిక కీని విడుదల చేసి, అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలపాలని కోరారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి ఈ ఫలితాలను(TG EdCET Results Out) ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా EdCET పరీక్షకు మొత్తం 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 29,342 మంది పరీక్షకు హాజరయ్యారు.

ఫలితాల కోసం లింక్ పైన క్లిక్ చేయండి

https://edcet.tgche.ac.in

TG EdCET 2026 స్కోర్‌కార్డు: డౌన్‌లోడ్ చేసే విధానం

మీ TGEdCET స్కోర్‌కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది దశలను అనుసరించండి:

TG EdCET అధికారిక వెబ్‌సైట్‌ను తెరవండి.

"TG EdCET 2026 Result" లేదా "Download Rank Card" లింక్‌ వద్దకు వెళ్లండి.

అవసరమైన వివరాలను నమోదు చేయండి.

స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోండి.

స్కోర్‌కార్డును భద్రపరచుకోండి.

ఫలితాల ప్రకటన అనంతరం, అర్హత సాధించిన అభ్యర్థులు TG EdCET 2026 కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అర్హత పొందుతారు. TGEdCET కౌన్సెలింగ్ జూన్ 2026లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

కౌన్సెలింగ్ ప్రక్రియలో ఈ క్రింది అంశాలు ఉంటాయి.

నమోదు

పత్రాల పరిశీలన

వెబ్ ఎంపికలు

సీట్ల కేటాయింపు

ప్రవేశ నిర్ధారణ.

అభ్యర్థులు కౌన్సెలింగ్ షెడ్యూల్‌లు, ప్రవేశ ప్రకటనల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను https://edcet.tgche.ac.in క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.