23 July, 2026 | 1:20 AM

సొసైటీ డైరెక్టర్‌గా శ్రీకాంత్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి

23-07-2026 12:47 AM

మేడ్చల్, జూలై 22 (విజయ క్రాంతి): షా మీర్పేట్ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ గా మాచన్నగారి శ్రీకాంత్ రెడ్డి కి అవకాశం ఇవ్వాలని జిల్లా రైతు సమైక్య సభ్యులు అభిప్రాయపడ్డా రు. కలెక్టరేట్లో జిల్లా అధ్యక్షుడు ముద్దం సం జీవరెడ్డి అధ్యక్షతన జిల్లా రైతు సమైక్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సభ్యు లందరూ శ్రీకాంత్ రెడ్డి పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. శ్రీకాంత్ రెడ్డి కి రైతు సమస్యలపై అవగాహన ఉందని, రైతులకు న్యా యం జరుగుతుందన్నారు. అంతేగాక రైతులందరినీ ఐక్యంగా ఉంచుతారన్నారు.