5 June, 2026 | 2:32 AM

రిటర్మైంట్ ప్రకటించిన శ్రీకర్ భరత్

05-06-2026 12:13 AM

విశాఖపట్నం, జూన్ 4 : భారత వికె ట్ కీపర్ బ్యాటర్, తెలుగుతేజం శ్రీకర్ భరత్ సంచలన నిర్ణ యం తీసుకున్నాడు. 32 ఏళ్ల వయసులో నే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. టీమిండి యా తరఫున ఆడటం నా జీవితంలో అత్యున్నత గౌరవం. నా ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్ లు, సహచర ఆటగాళ్లు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐకి ఎప్పటికీ రుణపడి ఉంటా.

ఐపీఎల్లో తొలి అవకాశం ఇచ్చిన కో హ్లీకి, టెస్టు అరంగేట్రం కల్పించిన రోహిత్ శర్మకు, ఇండియా-ఏ నుంచి జాతీయ జట్టు వరకు తనను ప్రోత్సహించిన ద్రవిడ్‌కు కృతజ్ఞతలు అంటూ రిటైర్మెంట్ ప్రకటనలో వెల్ల డించాడు. భరత్.. 2023లో ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ టెస్టులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో టీమిండియా తరఫున 7 టెస్టులు ఆడి, 221 పరు గులు చేశాడు. వికెట్ కీపర్‌గా 18 క్యాచ్‌లు, ఒక స్టంపింగ్ నమోదు చేశాడు. రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి వికెట్ కీపర్-బ్యాటర్‌గా అతడు 2015లో రికార్డు నమోదు చేశాడు.