5 June, 2026 | 2:24 AM

హెచ్‌సీఏ వ్యవహారాలపై జోక్యం చేసుకోండి

05-06-2026 12:10 AM

జస్టిస్ నవీన్‌రావుకు తెలంగాణ క్రికెటర్ల లేఖ

హైదరాబాద్, జూన్ 4 : హైదరాబాద్ క్రికెట్ అసోసి యేషన్ పరిపాలనా వ్యవహరాల్లో హైకోర్టు పర్యవేక్షణను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ క్రికెటర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు జస్టిస్ పి.నవీన్‌రావు(రిటైర్డ్) తక్షణ జోక్యం కోరుతూ లేఖ రాశారు. గత కొంతకాలంగా హెచ్‌సీఏ తీరు అభ్యంతరకరంగా ఉందనీ, నిబంధనలు పాటించకుం డా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనీ వా రంతా మండిపడ్డారు. హెచ్‌సీఏ తీసుకునే ని ర్ణయాలన్నీ సింగిల్ మెంబర్ సూపర్‌వైజర్ ఆమోదం పొందడం లేదన్నారు.

ముఖ్యంగా టీజీ20 లీగ్‌లో గవర్నిం గ్ కౌన్సిల్ నియామకాలు, ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, ఫ్రాంచైజీ ఒప్పం దాలు వంటి వాటిపై పూర్తి వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైకోర్టు పర్యవేక్షణ వ్యవస్థ అమల్లో ఉన్నా గతంలో వచ్చిన ఫిర్యాదులకు ఇప్పటికీ పరిష్కారం దొరకలేదన్నారు. వారం రోజుల్లో చర్యలు తీసుకుని పూర్తి వివరాలు వెల్లడించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.