27 July, 2026 | 3:07 AM

మానవత్వం చాటిన పూర్వవిద్యార్థులు

27-07-2026 02:31 AM

వీపనగండ్ల, జూలై 26: మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన కావలి సుదర్శన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెంద గా, ఆయన కుటుంబానికి అండగా నిలిచిన 199697 విద్యా సంవత్సరానికి చెందిన జ డ్పీహెచ్‌ఎస్ బొల్లారం పూర్వ విద్యార్థులు మానవత్వాన్ని చాటారు.

వారు కలిసి సేకరించిన రూ.85 వేల నగదును మృతుడి భార్య మాధవికి ఆదివారం అందజేశారు. ఈ సం దర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పూర్వ విద్యార్థులు, భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్థిక సాయం అందించిన పూర్వ విద్యార్థులకు మాధవి కృతజ్ఞతలు తెలిపారు.