25 July, 2026 | 3:07 AM

గాంధీ ఆస్పత్రిలో అందుబాటులోకి హార్ట్-లంగ్ మెషిన్

25-07-2026 02:36 AM

రూ.3 కోట్ల హార్ట్-లంగ్ మెషిన్ 

సికింద్రాబాద్, జూలై 24 (విజయక్రాంతి): గాంధీ ఆస్పత్రిలోని కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక హార్ట్-లంగ్ మె షిన్ను తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ శుక్రవారం ప్రారంభించారు. గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు చేయించుకునే రోగులకు అత్యాధునిక, నా ణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడమే ఈ యంత్రం ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశమని డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు.

ఈ యంత్రం అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలను మరింత సమర్థవంతంగా నిర్వహిం చే అవకాశం ఏర్పడిందన్నారు. ఈ  కార్యక్రమంలో గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రవీంద్ర, డిప్యూటీ సూప రింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్, వైస్ ప్రిన్సిపల్స్, వివిధ విభాగాల ప్రొఫెసర్లు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

హార్ట్‌లంగ్ మెషిన్ ప్రత్యేకత..

ఓపెన్ హార్ట్ సర్జరీ సమయంలో గుండె, ఊపిరితిత్తుల పనితీరును తాత్కాలికంగా ఈ హార్ట్-లంగ్ మెషిన్ నిర్వహిస్తుంది. శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో శరీరానికి నిరంతర రక్త ప్రసరణ కల్పించడంతో పాటు రక్తా న్ని శుద్ధి చేసే కీలక బాధ్యతను ఈ యంత్రం నిర్వర్తిస్తుంది. గుండె కవాటాల మార్పిడి, పు ట్టుకతో వచ్చే గుండె లోపాల సవరణ, ఇతర క్లిష్టమైన ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్సల్లో ఈ యం త్రం కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ సదుపాయం అందుబాటులోకి రావడం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన రోగులకు ఎంతో మేలు చేకూరనుంది అని డాక్టర్లు తెలియజేశారు.