26 August, 2026 | 3:08 AM

బీఎస్పీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్ నియామకం

26-08-2026 02:01 AM

రంగారెడ్డి, ఆగస్టు 25 (విజయక్రాంతి): బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడిగా  సొంటె శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ మంగళవారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జీగా శ్రీనివాస్ అందించిన సేవలు, పనితీరును గుర్తించి ఈ కొత్త బాధ్యతలను అప్పగించారు.

జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేస్తారాని ఇబ్రాం శేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో షాద్నగర్ అసెంబ్లీ అధ్యక్షుడిగా, బూత్ స్థాయి కార్యకర్తగా పనిచేసిన అనుభవం ఉన్న శ్రీనివాస్, పార్టీ అధినేత్రి మాయావతి ఆదేశాల మేరకు బీఎస్పీ బలోపేతానికి శ్రమిస్తానని తెలిపారు. హైదరాబాద్ను పార్టీ నిర్వహణ కోసం హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు జిల్లాలుగా విభజించారు.