3 July, 2026 | 12:51 PM

Breaking News

విద్యుత్ ఏఈఈగా శ్రీనివాసరావు

18-10-2024 07:13 PM

దౌల్తాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగ బదిలీలలో భాగంగా రాయపోల్ విద్యుత్ శాఖ ఏఈఈ గా శ్రీనివాసరావు పదవి బాధ్యతలు శుక్రవారం మండల కేంద్రం సబ్ స్టేషన్ కార్యాలయంలో చేపట్టారు. గతంలో తొగుట మండలం ఏఈఈ గా విధులు నిర్వహించిన శ్రీనివాసరావు బదిలీపై రాయపోల్ మండలం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపోల్ మండలంలోని  విద్యుత్ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. విద్యుత్ వినియోదారులు, ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.