3 July, 2026 | 1:46 PM

భవిష్యత్ ఉద్యోగావకాశాలకు.. కృత్రిమ మేధస్సు నైపుణ్యాలే కీలకం

03-07-2026 12:44 PM

ఖమ్మం హెల్త్ విజయక్రాంతి: ఖమ్మంలోని ప్రియదర్శిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ స్వయంప్రతిపత్తి కళాశాలలో విద్యార్థినులకు భవిష్యత్ ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో “ఏఐ స్కిల్స్ గెట్ యు హైర్డ్ ఇన్ 2026” అంశంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆన్‌రోల్ ఏఐ ఎగ్జిక్యూషన్ స్కూల్ సహకారంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల చైర్మన్ కాటేపల్లి నవీన్‌బాబు మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు భవిష్యత్ ఉద్యోగావకాశాలకు కీలకమవుతోందని అన్నారు. సంప్రదాయ విద్యతో పాటు డిజిటల్, కృత్రిమ మేధస్సు నైపుణ్యాలను అలవర్చుకుంటే దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. గోపాల్ మాట్లాడుతూ, విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీత పి. అష్టికర్, డాక్టర్ నీరజా రెడ్డి, శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు, డిజిటల్ నైపుణ్యాలు రానున్న రోజుల్లో ఉపాధికి కీలకమవుతాయని పేర్కొన్నారు. అకాడమిక్ డైరెక్టర్ ఎ. వెంకటరమణ మాట్లాడుతూ క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర అభ్యాసంతోనే విజయం సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.