శ్రీపాదరావు సేవలు మరువలేనివి
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి, మార్చి 2 (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా పనిచేసి స్పీకర్ పదవికి దేశ వ్యాప్తంగా వన్నె తీసుకు వచ్చిన గొప్ప నాయకులు స్వర్గీయ శ్రీపాదరావు అని, ఆయన సేవలు మరువలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు మార్ అన్నారు. సోమవారం ధర్మపురి పట్టణ కేంద్రంలో స్వర్గీయ శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలను ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అంచలంచలుగా ఎదిగి ఉమ్మడి రాష్ట్రంలో శా సనసభకు శ్రీపాద రావు గారు స్పీకర్ గా వ్యవహరించారని గుర్తు చేశారు. స్పీకర్ గా పనిచేస్తున్న సమయంలో ప్రతిపక్ష నేతలకు సైతం సమయం ఇస్తూ స్పీకర్ పదవికి వన్నె తీసుకువచ్చారని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రీపాదరావు అండగా నిలిచి వారి కష్టాల్లో భాగమయ్యారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి శ్రీపాద రావు చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘనభట్ల దినేష్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ఇందారం రామన్న, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




