మహిళా ఆర్థిక స్వావలంబనకు ప్రజా ప్రభుత్వం తగిన కృషి
ఎమ్మెల్యే మందుల సామేలు
తుంగతుర్తి, ఏప్రిల్ 13 : మహిళలు ఆర్థికస్వాబలంబన సాధించేందుకు ప్రజా ప్రభు త్వం నిరంతరం కృషి చేస్తోందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. సోమవారం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 5 మండలాలకు సంబంధించి 265 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.2,65,30,740 కోట్ల విలువగల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల ను తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ తో కలిసి పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ ఆడపడుచు పెళ్లి చేసి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేరుతో వారికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,
రూ.500 కే గ్యాస్ సిలిండర్ వంటి సౌకర్యాలు మహిళల జీవన ప్రమాణాల్ని మార్చేస్తున్నాయని తెలిపారు. ఇంది రా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సాయంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యం అని తెలిపారు.
అంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు పచ్చిపాల సుమతి వెంకన్న కుమార్తె వైష్ణవి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు అత్యుత్తమ మార్కులు991/1000 సాధించగా ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి, పదివేల రూపాయలు ఆర్థిక సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో,తుంగతుర్తి గ్రామ సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, సింగల్ విండో మాజీ చైర్మన్ గుడిపాటి సైదులు,
వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరీ గోవర్ధన్, రేగటి రవి గౌడ్, తాసిల్దార్ దయానందం, సర్పంచులు,రెవెన్యూ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ మహిళా కమిటీ జిల్లా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, పచ్చిపాల సుమతి,దాయం ఝాన్సీ రాజి రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.




