18-02-2026 12:30:40 AM
వనపర్తి డిపో మేనేజర్కు వినతిపత్రం
శ్రీరంగపురం ఫిబ్రవరి 17:శ్రీరంగాపూర్ మండల కేంద్రం నుంచి పెబ్బేరు పట్టణానికి బస్సు సౌకర్యం కల్పించాలని సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు వనపర్తి డిపో మేనేజర్కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో పెబ్బేరు నుంచి శ్రీరంగాపూర్ వరకు రోజుకు 8 ట్రిప్పుల బస్సు సర్వీస్ నడిచేదని గుర్తు చేశారు.
ఆ సర్వీస్ నిలిచిపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.మార్చి నెలలో శ్రీరంగాపూర్లో జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల రాకపోకలు పెరుగుతాయని, అందువల్ల తక్షణమే బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని డిపో అధికారులను కోరారు.
గతంలో ఉన్నట్లే కనీసం 8 ట్రిప్పులను పునరుద్ధరించి, అవసరమైతే అదనపు ప్రత్యేక సర్వీసులు నడపాలని వినతిపత్రంలో సూచించారు.ఈ కార్యక్రమంలో సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్, స్థానిక బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు కళ్యాణికారి ఖాజా, నాయకులు వెంకట్ స్వామి పాల్గొని బస్సు సౌకర్యం పునరుద్ధరణకు సహకరించాలని అధికారులను కోరారు.