18-02-2026 12:29:26 AM
సన్నిధిలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పూజలు
జడ్చర్ల, ఫిబ్రవరి 17: మండలంలోని మీనాంబర గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పర్షవేదిశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. తదుపరి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన భజన పోటీలను ఎమ్మెల్యే తిలకించారు.
భక్తి భావంతో పాల్గొన్న విద్యార్థులు, యువతను అభినందించి వారి ప్రతిభను ప్రశంసించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సాంప్రదాయ విలువలను పెంపొందిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భక్తుల సౌకర్యాల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.