calender_icon.png 18 November, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబాకస్ పోటీల్లో ‘సిప్’ సత్తా

18-11-2025 12:53:52 AM

అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, విజయాలు సాధించిన విద్యార్థులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 17 (విజయక్రాంతి): 22వ సిప్ (ఎస్‌ఐపీ) అంతర్జాతీయ ప్రాడిజీ (భారతదేశ వ్యాప్తం గా జరిగిన అబాకస్, మెంటల్ అరిథ్మెటిక్) పోటీలు ఈ నెల 16న చెన్నై ట్రేడ్ సెంటర్‌లో నిర్వహించారు. ప్రాడిజీ పోటీలలో, దేశ విదేశాల నుంచి సుమారు 6 వేల మంది విద్యా ర్థులు అబాకస్‌లో పోటీపడ్డారు. మణికొండలోని మా జ్ఞానవాటికా సిప్ అబాకస్ అకాడ మీ విద్యార్థులు అత్యంత అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, అత్యుత్తమ మేధావులతో పోటీపడి విజయాలు సాధించారు.

ఈ సందర్భంగా సెంటర్ హెడ్ గడ్డి శ్రీవాణి కరణ్ విజేతలకు, వారి తల్లిదండ్రులకు, శిక్షకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అక్షయరెడ్డి బహుమతి), దార్షిక్ శ్రేయన్ బహుమతి,  ద్వితీయ బహుమతి ఆయెన్ కర్రి అడ్వాన్స్ 4, ద్వితీయ బహుమతి గ్విన్నెత్ గిర్లీన్ అడ్వాన్స్ 1, తృతీయ బహుమతి రోహిత్ సాయి అఖిలేష్ జీఎంసీ అందుకున్నారు. ప్రతిభావంతమైన ప్రదర్శన పురస్కారాలు సాహిత్ నిహాల్, లిఖి త్ శ్రావణ్, తోషిత్ గణేష్ నందన్, హేమశ్రీ, హారిణిశ్రీ, సేహిత రెడ్డి, జారా ఆరూషి, ధనుష్ రెడ్డి, వియాన్ షాన్విత్, హర్షవర్ధన్, ధాన్విక, అర్నవ్ వేముల అందుకున్నారు.