నీట్ ఫలితాలలో ఎస్‌ఆర్ ప్రభంజనం
హైదరాబాద్, జులై 17 (విజయక్రాంతి): ఈరోజు ప్రకటించిన నీట్ ర్యాంకులలో ఎస్‌ఆర్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నీట్ ప్రవేశానికి వెలువడిన ఫలితాలలో ఎస్‌ఆర్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన విజయాలను సాధించి జాతీయ స్థాయిలో ఎస్‌ఆర్ విజయ పథాన్ని మరోసారి ఎగుర వేసారు.
జాతీయ స్థాయిలో 705/720 మార్కులు, జనరల్ కేటగిరీలో వీరియ్యగారి సహ్యు(రోల్ నెం. 4205112209) 9వ ర్యాంకు సాధించి ఎస్‌ఆర్ కీర్తి ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో నిలబె ట్టారు. రాష్ట్రంలోని ఎస్‌ఆర్ విద్యా సంస్థలకు చెందిన 275 మందికి పైగా విద్యార్థులు మె డిసిన్‌లో సీట్లు సాధించే ర్యాంకులు సంపాదించారు.
నీట్‌లో విద్యార్థులు సాధించిన ఈ విజయాలకు సంతోషాన్ని తెలియజేస్తూ ఎస్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్‌రెడ్డి భవిష్యత్తులో మరింత అత్యుత్తమైన ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తీకరించారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్న మా విద్యార్థులు ఈ ఏడాది జేఈఈ (మెయిన్)లో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు, జేఈఈ(అడ్వాన్స్‌డ్)లో సెకండ్ ర్యాంక్ సాధించారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికి స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు.






