calender_icon.png 14 May, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీబీఎస్‌ఈ పది ఫలితాలలో సెయింట్ జార్జ్ విద్యార్థుల ప్రభంజనం

14-05-2025 01:22:13 AM

కరీంనగర్, మే 13 (విజయ క్రాంతి):   సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థులు మంగళవారం  ప్రకటించిన సీబీఎస్‌ఈ పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి  ప్రభంజనం సృష్టించారు.

పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అర్హాన్ (486/500), నేహశ్రీ (477/500) మరియు హన్సిక్ (475/500) మార్కులతో మొదటి మూడు స్థానాలలో నిలిచారని సెయింట్ జార్జ్, పారడైజ్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పి ఫాతిమారెడ్డి తెలిపారు.

400 పై మార్కులతో  26 మంధి విధ్యార్థులు,  తెలుగులో యమున 100/100 మార్కులు, సైన్స్ లో అర్హన్ 100/100 మార్కులతో అద్భుతమైన ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను చైర్మన్  ఫాతిమారెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.