14-05-2025 01:20:32 AM
కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, మే 13 (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ మేరకు కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి మండలం ఆరపేట, ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ, మల్లాపూర్ మండలం సాతారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందన్నారు. కలెక్టర్ వెంట మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.శ్రీనివాస్, డీఎస్‌ఓ, డిఎం, ఆయా మండలాల తహసిల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.