1 March, 2026 | 1:59 PM

సమయపాలన పాటించని సిబ్బందిపై చర్య లేనట్లేనా?

01-03-2026 12:12 PM

తుంగతుర్తి మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బంది ఇస్తారాజ్యం

తుంగతుర్తి(విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇరువురు సిబ్బంది మధ్యాహ్నం డ్యూటీలు మరిచి, ఏకంగా దావత్ చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. తుంగతుర్తిమండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కంప్యూటర్ డ్యూటీలు చేస్తున్న ఇరువురు సిబ్బంది, మధ్యాహ్నం సమయం దాటిన తర్వాత కార్యాలయానికి రాకపోవడంతో పనుల కోసం వచ్చిన వ్యక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.

మధ్యాహ్నం 1: 30 నిమిషాల నుండి3:30 నిమిషాల వరకు బయట తిరుగుతూ, దావతులకు వెళ్తూ, కార్యాలానికి రాకపోవడం, మండల ప్రజాపరిషత్ బాస్ ట్రైనింగ్ పై డ్యూటీలో ఉండగా, కార్యాలయంలో ఈ విధంగా జరగడం పట్ల ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై విచారణ జరిపి, సమయపాలన పాటించని  సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజలు కోరుతున్నారు. జరిగిన సంఘటనపై ఫోన్లో ఎంపీడీవో శేష్ కుమార్ ను వివరణ కోరగా, తాను ట్రైనింగ్ లో ఉన్నట్లు, నాకేమీ తెలియదని తెలిపారు.