1 March, 2026 | 2:00 PM

మంథని ప్రజల సమస్యలు తీర్చేందుకే వార్డు కార్యాలయాలు

01-03-2026 12:14 PM

మంథనిలో మున్సిపల్ వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణ ప్రజల సమస్యలు తీర్చేందుకే వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం మంథని మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డుతో పాటు 5 వ వార్డు కార్యాలయంలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కుడుదుల వెంకన్న, కౌన్సిలర్ లు కుర్ర లింగయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్రు రామాదేవి, జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.