calender_icon.png 2 November, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసన

02-11-2025 04:52:45 PM

నకిరేకల్ (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు గర్వి మురళీమోహన్, మండల అధ్యక్షులు బుడిగే సైదులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు యానాల శంకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి పందాల సైదులు, బోనగిరి వెంకటేశ్వర్లు, నాయకులు అప్పం అంజయ్య, గడ్డం మహేష్ రెడ్డి, నడికుడి సైదులు, సందుపట్ల వేణుమాధవ్, ఏర్పుల రేణుక, కారింగు యాదగిరి, ఏర్పుల అంజి, నల్లగొండ లింగయ్య పాల్గొన్నారు.