పేద రోగులకు అండగా..
ఎల్‌వోసీ అందజేసిన ఎమ్మెల్యే ధన్ పాల్
ఇందూరు, ఏప్రిల్ 28(విజయక్రాంతి): పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని, అవసరమైన వారికి నిమ్స్‌లో ఎల్‌వోసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం పలువురికి ఎల్‌వోసీ పత్రా లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఎల్‌వోసీ ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని మాలపల్లికి చెందిన అహ్మది బేగం నరాల సంబంధిత వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో నిమ్స్‌లో చికిత్స పొందుతు న్న నేపథ్యంలో రూ.5 లక్షల ఎల్ వోసీ అందజేశా మన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పం దించి రోగికి తక్షణ సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.






