23 May, 2026 | 1:55 PM

ప్రైవేట్ జెట్ లో ఆఫీస్ కు .. స్టార్ బక్స్ సీఈవో రోజూ ప్రయాణం

21-08-2024 11:53 AM

సియాటెల్: బడా కంపెనీల సీఈఓలకు ప్యాకేజీలు, సౌకర్యాలు చూస్తే సాధారణ ఉద్యోగులకు కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. తాజాగా ఓ కంపెనీ సీఈవో విధులకు హాజరయ్యేందుకు 1600 కిలో మీటర్లు ప్రయాణించేలా ఏకంగా ప్రైవేట్ జెట్ నే ఇచ్చారు. అమెరికా కాఫీ దిగ్గజం స్టార్ బక్స్ నూతన సీఈవో బ్రియాన్ నికోల్ మాత్రం తన ఇంటి నుంచి 1600 కిలోమీటర్ల దూరంలోని కార్పోరేట్ ఆఫీస్ కు రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కార్పోరేట్ జెట్ కూడా సిద్ధమైనట్లు సంస్థ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నికోల్ కాలీఫోర్నయాలోని ఇంట్లో ఉంటున్నారు. ఇక స్టార్ బక్స్ ప్రధాన కార్యాలయం సియాటెల్ లో ఉంది. కంపెనీ హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం వారంలో కనీసం మూడురోజులు సియాటెల్ నుంచి ఆయన పని చేస్తారు. ఏటా 1.6 మిలియన్ డాలర్లు ఆయనకు వార్షిక  వేతనం రూపంలో ఇవ్వనున్నారు.