23 May, 2026 | 2:47 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

పోలాండ్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోడీ

21-08-2024 11:17 AM

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం పోలాండ్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తన కౌంటర్ డొనాల్డ్ టస్క్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడాతో చర్చలు జరుపుతారు. 45 ఏళ్ల తర్వాత పోలాండ్‌లో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ఇవాళ, రేపు ప్రధాని మోడీ పోలాండ్ లో పర్యటించనున్నారు. భారత్-పోలాండ్ దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తి అయ్యాయి. దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూరైన సందర్భంగా మోడీ పర్యటిస్తున్నారు. మధ్య ఐరోపాలో భారత్ కు పోలాండ్  కీలక ఆర్థిక భాగస్వామిగా ఉంది. ఈ పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ పోలాండ్ లో ఉన్న భారతీయులను కలవనున్నారు. ఎల్లుండి పోలాండ్ నుంచి రైలులో మోడీ ఉక్రెయిన్ వెళ్లనున్నారు. ఉక్రెయిన్ లో పర్యటించనున్న తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించబోతున్నారు. జెలెన్ స్కీ ఆహ్వానం మేరకు ఉక్రెయిన్ వెళ్తున్నట్లు ఎక్స్ లో ప్రధాని మోడీ వెల్లడించారు. ఉక్రెయిన్- రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో మోడీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ లో శాంతి, స్థిరత్వం తిరిగి రావాలని ఆశిస్తున్నానని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.