9 May, 2026 | 2:41 AM

నిరుపేద కుటుంబానికి స్టార్ హెల్త్ ఆసరా

09-05-2026 01:44 AM

రూ.65 లక్షల చెక్కును మృతిని కుటుంబానికి అందించిన స్టార్ హెల్త్ కంపెనీ

ఖమ్మం, మే 8(విజయక్రాంతి): అత్యంత నిరుపేద కుటుంబానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆసరాగా నిలిచింది. రూ.3750లతో చిన్న యాక్సిడెంట్ పాలసీ చేసిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించడంతో అతి పెద్ద అమౌంట్ రూ.65లక్షల చెక్కును స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు ఆ కుటుంబానికి అందజేశారు. శుక్రవారం ఖమ్మం మెయిన్ ఆఫీస్ లో ఏపీలో, తెలంగాణ రాష్ట్రాల బిజినెస్ హెడ్ కే.బీ.బీ శ్రీనివాస్, అసిస్టెంట్ రిజినల్ హెడ్ జి. సురేష్, జోనల్ క్లైయిమ్స్ హెడ్ డా.సాయి కిరణ్ అసిస్టెంట్ జోనల్ హెడ్ రాజా రెడ్డి కలిసి రూ.65 లక్షల చెక్కును మృతుని కుటుంబానికి అందజేశారు. చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన తుమ్మలపల్లి వెంకట్రావు ఇటీవలే ప్రమాదశాత్తు చనిపోయారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లో పాలసీ తీసుకున్న కస్టమర్లకు ఇన్ టైమ్ లో క్లైయిమ్స్ అందిస్తున్న ఏకైక ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ అని అన్నారు. స్టార్ లో పాలసీ తీసుకునే ప్రతి ఒక్కరికి బాధ్యతగా పనిచేస్తామని హామి ఇచ్చారు. మృతుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కష్టకాలంలో మా కుటుంబానికి అండగా నిలిచిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ రవికుమార్, సెల్స్ మేనేజర్ సంజయ్ కుమార్, రామారావు మృతుని భార్య రాధా, ఏజెంట్లు పాల్గొన్నారు.