calender_icon.png 4 June, 2025 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ సన్నిధిలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

02-06-2025 10:25:58 PM

సారంగాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) సందర్భంగా మండలంలోని అడెల్లి గ్రామ పోచమ్మ దేవాలయం వద్ద ఆలయ అధ్యక్షుడు సింగం భోజా గౌడ్ సోమవారం జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారుల త్యాగ ఫలమే సాధించిన ప్రత్యేక రాష్ట్రం అని గుర్తు చేసారు. రాష్ట్రం కోసం అసువులు బాసిన అమర వీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్ బట్టు భోజన్న, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.