క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
పీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్‌గుప్తా
విజేతలకు బహుమతులు అందజేసిన ఉప్పల
నాగోల్, బండ్లగూడలో ఉమెన్స్ నేషనల్ సైక్లింగ్ లీగ్ పోటీలు
హైదరాబాద్, ఏప్రిల్ 8(విజయక్రాంతి): క్రీడా రంగంలో మహిళలకు ప్రోత్సాహం అందించే దిశగా నిర్వహిస్తున్న అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ నేషనల్ సైక్లింగ్ లీగ్ పోటీలను నాగోల్, బండ్లగూడలో విజయవంతమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు క్రీడల్లో ముందుకు రావడం ఎంతో ఆనందదాయకమని, కేంద్ర ప్రభుత్వం క్రీడలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించా రు. యువతిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో ఉప యోగకరమని తెలిపారు. ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభు త్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ క్రీడాకారులను అన్ని విధాలా అండగా ఉంటుంద న్నారు. ఈ సైక్లింగ్ పోటీల్లో 20 రాష్ట్రాల నుంచి విద్యార్థినులు పాల్గొన్నారు. సబ్-జూ నియర్, జూనియర్, ఎలైట్ విభాగాల్లో 120 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
సైక్లింగ్ పోటీల ఫలితాలు:
సబ్ జూనియర్ మాస్ స్టార్ట్: గోల్డ్: దీపి క ఫడతరే (సౌత్ జోన్),సిల్వర్: మంసీ కిషోర్ మహాజన్ (వెస్ట్ జోన్),బ్రాంజ్: మినీ (ఈస్ట్ జోన్)
ఉమెన్ జూనియర్ మాస్ స్టార్ట్:గోల్డ్: నార్కర్ జూయి గజానన్ (వెస్ట్ జోన్), సిల్వర్: జలవడియా హెనీ మనీష్ కుమా ర్ (వెస్ట్ జోన్),
బ్రాంజ్: కోకిలా చవాన్ (సౌత్ జోన్), ఉమెన్ ఎలైట్ మాస్ స్టార్ట్:గోల్డ్: జ్యోతి కుమావత్ (వెస్ట్ జోన్), సిల్వర్: కీర్తి నాయక్ (సౌత్ జోన్),
బ్రాంజ్: లక్ష్మి కుమారి (ఈస్ట్ జోన్),సబ్ జూనియర్ ఐటీటీ:గోల్డ్: దీపిక ఫడతరే (సౌత్ జోన్), సిల్వర్: పికీ కుమారి (ఈస్ట్ జోన్), బ్రాంజ్: మంసీ కిషోర్ మహాజన్ (వెస్ట్ జోన్),ఉమెన్ జూనియర్ ఐటీటీ: గోల్డ్: నార్కర్ జూయి గజానన్ (వెస్ట్ జోన్), సిల్వర్: జలవడియా హెనీ మనీష్ కుమార్ (వెస్ట్ జోన్),బ్రాంజ్: కోకిలా చవాన్ (సౌత్ జోన్),ఉమెన్ ఎలైట్ మాస్ స్టార్ట్ (2వ ఈవెంట్):గోల్డ్: కీర్తి నాయక్ (సౌత్ జోన్), సిల్వర్: ధాపు (జోన్ వివరాలు లేవు), బ్రాంజ్: జ్యోతి కుమావత్ (వెస్ట్ జోన్),ఆర్డినరీ సైకిల్ కేటగిరీ:గోల్డ్: నవీన్ వాల్లెటీ (సౌత్ జోన్), సిల్వర్: దీక్షిత (సౌత్ జోన్), బ్రాంజ్: దీపిక కున్న (సౌత్ జోన్),రేసింగ్ సైకిల్ కేటగిరీ (12 సంవత్సరాలు):గోల్డ్: తనిష్కా సాల్వేర్ (సౌత్ జోన్), సిల్వర్: సహిత్య ఉదారి (సౌత్ జోన్), బ్రాంజ్: జోహా మిశ్రా (సౌత్ జోన్)
ఈ కార్యక్రమంలో సంజీవ రెడ్డి, శంతన్, సెంట్రల్ వాటర్ బోర్డ్ రీజనల్ డైరెక్టర్ నల్లి జ్యోతి కుమార్, వోబులేశ్ యాదయ్య, మేజ ర్ జనరల్ శ్రీనివాస్, నిర్వాహకులు డాక్టర్ మాక్స్‌వెల్ శ్రీకాంత్ పాషా శ్రీకాంత్, పలువు రు క్రీడా ప్రముఖులు, నాయకులు, క్రీడాకారిణులు కోచ్‌లు , మరియు స్థానికులు పాల్గొన్నారు.




