9 April, 2026 | 2:46 AM

ఫైట్ విభాగంలో చల్లా వర్షితరెడ్డి సత్తా

09-04-2026 12:00 AM

రజత పతకం సాధించిన సీఎంఆర్ స్కూల్ విద్యార్థిని

గుజరాత్‌లో జరిగిన అస్మితా ఖేలో ఇండియా పెన్కాక్ సిలాత్ ఉమెన్ లీగ్

హైదరాబాద్, ఏప్రిల్ 8(విజయక్రాంతి): అస్మితా ఖేలో ఇండియా పెన్కాక్ సిలాత్ ఉమెన్ లీగ్ 2026లో సబ్ జూనియర్ విభాగానికి చెందిన జాతీయ స్థాయి క్రీడా పోటీ లు గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్‌లో ఉన్న యుగపురుష్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఘనంగా నిర్వహించారు.

ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ సీఎంఆర్ స్కూల్ (మేడ్చల్) నుంచి ఐదుగురు క్రీడాకారిణులు పాల్గొన్నారు.వీరిలో చల్లా వర్షిత రెడ్డి సబ్ జూనియర్ స్టాండింగ్ (ఫైట్) విభాగంలో రజత పతకాన్ని సాధించి ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొని రజత పతకం సాధించిన చల్లా వర్షిత రెడ్డిని సీఎంఆర్ స్కూల్ మేనేజ్‌మెంట్ హృదయపూ ర్వకంగా అభినందించింది.