16 March, 2026 | 11:49 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

పేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

17-03-2025 01:51 AM

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి 

నల్లగొండ, మార్చి 16 (విజయక్రాంతి) :  పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో 34 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 9 లక్షల 45 వేల విలువైన చెక్కులను ఆదివారం లబ్ధిదారులకు ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరి రక్షణకు సీఎంఆర్‌ఎఫ్ వరంలాంటిదన్నారు. నిరుపేదలు ఆర్థిక ఇబ్బంది లేకుండా అధునాతన వైద్యసేవలు పొందేందుకు సీఎం సహాయ నిధి దోహదం చేస్తున్నదని పేర్కొన్నారు.