8 April, 2026 | 4:39 PM

కందాల పాపిరెడ్డిని సత్కరించిన రాష్ట్ర గవర్నర్

15-10-2025 08:39 PM

నకిరేకల్ (విజయక్రాంతి): భారత మాజీ రాష్ట్రపతి  డాక్టర్ ఏ.పీ.జేఅబ్దుల్ కలాం 94వ జయంతిని పురస్కరించుకొని బుధవారం హైదరాబాదులో లీడ్ ఇండియా ఫౌండేషన్, ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాద్యాయుల సన్మనోత్సవంలో భాగంగా ట్రస్మ అధ్యక్షులు కందాల పాపిరెడ్డిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.